Saturday, March 21, 2026

నామినేషన్ల గ్రామపంచాయతీలను పరిశీలించిన : కలెక్టర్ ఇలా త్రిపాఠి-ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి

నేటి సాక్షి, మిర్యాలగూడ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నాగార్జున సాగర్ పరిధిలోని పెద్దవూర, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నామినేషన్లు ప్రక్రియను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు విధులు నిర్వహించాలని, నామినేషన్లు, ఉపసంహరణ, ఎన్నికలు జరిగే వరకు పటిష్ట బందోబస్తు, నిఘా ఉంచాలని, ఎన్నికల్లో 2పాల్గొనే వారికి ఎన్నికల నియమ నిబంధనలు నోటీస్ బోర్డ్ లో ఉంచాలని అధికారులకు సూచించారు. వారి వెంట తహశీల్దార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News