నేటి సాక్షి – మేడిపల్లి*( రాధారపు నర్సయ్య )మేడిపల్లి మండలం గ్రామం కల్వకోట మరియు కొండాపూర్, గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పరిశీలించారు.*ఎలాంటి పొరపాట్లు జరగకూడదు*ఈ సందర్భసంగా నామినేషన్ స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియ లో భాగం గా నోటిస్ ప్రదర్శించిన విధానాన్ని పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ సమయంలో ఆర్వో, ఏ ఆర్వో ఏమేమి చెక్ చేయాలో క్షుణ్ణంగా వివరించారు. అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. సమన్వయం చేసుకుంటూ అధికారులు అందరిని సమన్వయం చేసుకుంటూ తమ విధులు జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో తహశీల్దార్, ఎంపీడీఓ,సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.___





