Friday, February 20, 2026

నామ్ ఎక్స్‌ప్రెస్ టోల్ ప్లాజా నిర్లక్ష్యం-కూలీల పైకి దూసుకెళ్లిన లారీ-కూలీల ప్రాణాలతో చెలగాటం…భద్రతా కార్డులు, ఇన్సూరెన్స్ లేని బతుకులు-యాజమాన్యంపై మండిపడుతున్న బాధితులు

నేటిసాక్షి, మిర్యాలగూడ : నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై మాడుగులపల్లి మండల కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం టోల్ ప్లాజా యాజమాన్యం యొక్క అట్టడుగు భద్రతా ప్రమాణాలకు అద్దం పడుతోంది. నామ్ ఎక్స్‌ప్రెస్ టోల్ ప్లాజా పరిధిలో పనిచేస్తున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.​డబ్బు వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రాణాలపై లేదా..?​హైవేపై పనులు జరుగుతున్నప్పుడు కనీస భద్రతా నియమాలు పాటించడంలో టోల్ ప్లాజా యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కనీసం హెచ్చరిక బోర్డులు గానీ, బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు.​ఈ ప్రమాదం నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద పనిచేసే కార్మికులు, స్థానికులు యాజమాన్యం ముందు కీలక డిమాండ్లను ఉంచారు.​భద్రతా కార్డులు (సేఫ్టీ కార్డ్స్ ) విధి నిర్వహణలో ఉన్న ప్రతి కూలీకి అధికారికంగా భద్రతా గుర్తింపు కార్డులు జారీ చేయాలని,​పక్కా ఇన్సూరెన్స్ హైవేపై ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కూలీలందరికీ నామ్ ఎక్స్‌ప్రెస్ యాజమాన్యమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి, బీమా సౌకర్యం కల్పించాలి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బాధితుల వైద్య ఖర్చులన్నీ యాజమాన్యమే భరించాలి వారి కుటుంబాలకు భారీ నష్టపరిహారం చెల్లించాలి​యాజమాన్యం బాధ్యత వహించాలని,​టోల్ గేట్ల వద్ద ముక్కుపిండి వసూళ్లు చేసే టోల్ ప్లాజా నిర్వాహకులు, తమ దగ్గర పనిచేసే కూలీల ప్రాణాలకు మాత్రం భద్రత కల్పించడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సరైన రక్షణ కవచాలు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఇన్సూరెన్స్ గ్యారెంటీ లేకపోతే పనులు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.​ప్రస్తుతం మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో, పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన టోల్ ప్లాజా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News