నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జూలై 4 శుక్రవారం నుండి జూలై 10 గురువారం వరకు జరిగే ‘శ్రీ నారద మహాపురాణ’ ప్రవచన కరపత్రాన్ని వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు. శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మచే కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో జరిగే అష్టాదశ మహా పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 3వ కార్యక్రమంగా ఈ పురాణ ప్రవచనం ఏర్పాటు చేశారు. కోరుట్లతో పాటూ పరిసర ప్రాంతాల ఆధ్యాత్మిక బంధువులు ఈ ప్రవచనంలో పాల్గొని తరించాలని సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష, కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వొటారి చిన్న రాజన్న, మంచాల రాజలింగం, చలిగంటి వినోద్ కుమార్, శక్కరి వెంకటేశ్వర్, పిన్నంశెట్టి భానుమూర్తి, చౌడారపు శ్రీనివాస్, భోగ శ్రీధర్, ఎనుగందుల శ్రీనివాస్, శ్రీపాద నరసింహాచారి, బచ్చు శ్రీనివాస్, గంప శివకుమార్, రుద్ర సుధాకర్, ఎలగందుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





