Tuesday, March 17, 2026

నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన పేట జిల్లా డిసిసి అధ్యక్షులు కే. ప్రశాంత్ కుమార్ రెడ్డి….

నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 21, పీసీసీ అధ్యక్షులు ఆదేశానుసారం నారాయణపేట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా మరియు నిరసన కార్యక్రమం చేపట్టారు.నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులైన కె.ప్రశాంత్ కుమార్ రెడ్డిగారి ఆదేశానుసారం మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరును బిజెపి పార్టీ చట్టసభల్లో మార్చుట గురుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ధర్నా, నిరసన కార్యక్రమం జరుగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి ,టౌన్ ప్రెసిడెంట్ ఎండి సలీం ,నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాప్ నాగరాజు , మాగనూరు ఉమ్మడి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణు , నారాయణపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంతు , సీనియర్ నాయకులు కొక్కు శంకర్ , ఉట్కూరు మండల అధ్యక్షుడు విగ్నేష్ రెడ్డి,గురజాల రవి ,నారాయణపేట జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గౌస్ ,నారాయణపేట జిల్లా మైనార్టీ అధ్యక్షులు మమ్మద్ కోరేసి ,ఉట్కూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ , అనిల్ ,శంకర్,నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,బిసి సెల్, ఎసి సెల్,ఎస్ టి సెల్ మైనార్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు, కిసాన్ సెల్,ఎన్ ఎస్ యు అధ్యక్షులు,నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News