Monday, December 23, 2024

నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్​ కలకలం

నేటి సాక్షి, రాజేంద్రనగర్​: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్​ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి వ్యాపారవేత్త శిశువర్దన్​రెడ్డిపై రాయలసీమ గ్యాంగ్​ దాడి చేసి, కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. ఈ ఘటనపై వ్యాపారవేత్త కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూల్​కు వ్యాపారవేత్తను తరలిస్తుండగా, మహబూబ్​నగర్ జిల్లా వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శిశువర్ధన్​రెడ్డిని కాపాడారు. ఆర్థిక లావాదేవీల మూలంగానే కిడ్నాప్​ జరిగినట్టు తెలుస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News