Saturday, March 7, 2026

*నాలుగవ వార్డు అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా* *బిఆర్ఎస్ అభ్యర్థి నిమ్మ సుప్రజరాజీవ్ రెడ్డి*నేటి సాక్షి,

చేర్యాలచేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రచారంలో భాగంగా సీసీ రోడ్స్ ,డ్రైనేజీ వ్యవస్థ, అర్హులైన పేదలకు ఇండ్లు వచ్చే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చారు ఈ సమస్యలపై రాజీ లేని పోరాటమే, తన రాజకీయ మార్గమని 4వ వార్డు అభ్యర్థి అయిన నిమ్మ సుప్రజరాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంట్టూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించానని, అదే ఉద్యమ స్పూర్తితో నేటికీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతా అని గుర్తు చేశారు. మాటల్లో కాదు పనితోనే రాజకీయాన్ని నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మ సుప్రజరాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, కారు గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News