నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )*———-*”బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండవసారి ఎన్నికైన సురభి నవీన్ కుమార్‌కు కోరుట్ల నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. మెట్‌పల్లి అయ్యప్ప గుడి ముందరి నుంచి కోరుట్ల పట్టణంలోని ఆయన స్వగృహం వరకు సుమారు 1000 మంది కార్యకర్తలు భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు.జాతీయ రహదారిపై ఆయనకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు.!”**మెట్‌పల్లి అయ్యప్ప గుడి నుంచి ప్రారంభమైన కాషాయ జోష్.!*మెట్‌పల్లి అయ్యప్ప గుడి ముందరి నుంచి ప్రారంభమైన ఈ భారీ ద్విచక్ర వాహన ర్యాలీ ఆరంభం నుంచే ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. పార్టీ జెండాలు, బ్యానర్లు, నినాదాలతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మెట్‌పల్లి నుండి ఆరపేట, మారుతి నగర్ మీదుగా జాతీయ రహదారిపై సాగిన ఈ బైక్ ర్యాలీ మొత్తం మార్గమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. నవీన్ కుమార్‌కు స్వాగతం పలికేందుకు మార్గమధ్యంలో పలుచోట్ల స్థానికులు, వ్యాపారులు, యువత ముందుకు రావడం విశేషంగా నిలిచింది.*ఆరపేట.. మారుతి నగర్.. నంది చౌరస్తా వద్ద నీరాజనం.!*బైక్ ర్యాలీ ఆరపేట, మారుతి నగర్, నంది చౌరస్తా ప్రాంతాలకు చేరుకున్న సమయంలో అక్కడ ముందుగానే వేచి ఉన్న మహిళలు నవీన్ కుమార్‌కు హారతులు ఇచ్చి ఆశీస్సులు అందించారు. పూలతో, శుభాకాంక్షలతో ఆయనను ఆహ్వానించారు. మహిళల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ నవీన్ కుమార్ వారికి నమస్కరించారు.వారి ఆదరణ తనకు మరింత బాధ్యతను కలిగించిందని పేర్కొన్నారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ ఆయనను ఆహ్వానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.*నినాదాలతో మారుమోగిన జాతీయ రహదారి.!*జాతీయ రహదారిపై సాగిన ర్యాలీ సమయంలో ‘బిజెపి జిందాబాద్’..’నవీనన్న నాయకత్వం వర్ధిల్లాలి..’అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మెట్‌పల్లి నుంచి కోరుట్ల వరకు ప్రతి కిలోమీటరు దూరంలో కార్యకర్తల సందడి కనిపించింది. ఈ ర్యాలీ కేవలం స్వాగత కార్యక్రమం మాత్రమే కాకుండా, పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధతను ప్రతిబింబించేలా సాగింది.*భావోద్వేగ ప్రసంగం.. కార్యకర్తల్లో ఉప్పొంగిన ఉత్సాహం*కోరుట్ల బస్ స్టేషన్ ఔట్ గేట్ వద్ద కార్నర్ మీటింగ్‌లో కార్యకర్తలనుద్దేశించి ఉత్తేజితంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడారు. బిజెపి అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తలు లేకుంటే ఏ నాయకుడు లేడని పేర్కొన్నారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యులుగా మీతోడుంటానని, నా చివరి శ్వాస వరకు కాషాయాన్ని విడిచేది లేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదురొడ్డి పోరాడుతానని తెలిపారు.తన కోసం నిరీక్షించిన జనాలనుద్దేశించి సురభి నవీన్ కుమార్ ఉత్తేజపరుస్తూ మాట్లాడారు. ‘నాలో ప్రాణం ఉన్నంత వరకు బిజెపి లోనే ఉంటాను.. కార్యకర్తల కోసమే పనిచేస్తాను.. వారికి ఎల్లవేళలా తోడూ-నీడై కాపాడుకుంటానని..’ భావోద్వేగంగా మాట్లాడి హోరెత్తించారు. ఆయన మాటలకు కార్యకర్తలు హర్షధ్వానాలతో స్పందించారు. ఆయన చిన్నపాటి ప్రసంగానికే కార్యకర్తలు, అనుచరుల హృదయం సంతోషంతో ఉప్పొంగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.*రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు.. ఘన సన్మానం.!*తనపై నమ్మకంతో తనకి రెండవసారి బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి, సంఘ్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారి నివాసం వరకు బైక్ ర్యాలీగా బయలుదేరారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెండవసారి బాధ్యతలు స్వీకరించినందుకు బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించారు.*కార్యకర్తల ఐక్యత.. నాయకత్వంపై నమ్మకం.!*సుమారు వెయ్యి మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ, కోరుట్ల నియోజకవర్గంలో బిజెపి బలాన్ని, ఐక్యతను ప్రతిబింబించింది. రెండోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నవీన్ కుమార్ పట్ల కార్యకర్తల విశ్వాసం స్పష్టంగా కనిపించింది. భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు._________





