నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…………………………………తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు క్యారoగుల అరుణ సభ్యులతో కలిసి వెళ్లగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు లత, రాజగౌడ్ లతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేసి ఉద్యోగులను అభినందించారు.అలాగే టీ ఎన్ జీ ఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి అధ్యక్షురాలు అరుణ తో పాటు సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీను , సతీష్, రాజు, కె.భాగ్య, సృజన, రైషం, రాజు, శంకరమ్మ, రాజశేఖర్ రెడ్డి, మహేష్, మురళి, అరుణ, వసంత, గంగా రామ్, లక్ష్మి, రాజు, రాయనర్సు, స్వప్న, చెలన్, గంగా రామ్, సోమ శేఖర్, సుమన్, రాజేందర్, రషీద్ తదితరులున్నారు.

