Sunday, March 8, 2026

*నా ఆరాటం పోరాటం జగిత్యాల అభివ్రుద్ది కోసమే**యావర్ రోడ్డు వెడల్పు కు కట్టుబడి ఉన్నా…ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు..**గెలిపించిన ప్రజలకు అభివ్రుద్ది చేసి రుణం తీర్చుకుంట – ఎం ఎల్ ఏ సంజయ్ కుమార్*———————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………….ప్రభుత్వం తో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివ్రుద్ది కి కృషి చేస్తున్నా నియోజకవర్గం లో గత ప్రభుత్వం లో 2023 dec 7 కన్నా ముందు మొదలు పెట్టి తర్వాత పూర్తి చేసిన పనులకు పెండింగ్ బకాయిలు ప్రజా ప్రతినిధులు , కాంట్రాక్టర్ లకు చెల్లించడం జరిగింది.జగిత్యాల పట్టణం లో ఎక్కడా చూసిన అభివ్రుద్ది పనులు జరుగుతున్నాయి 1కోటి తో ఎల్ ఎల్ గార్డెన్ దగ్గర చేపట్టిన పనులకు సీనియర్ నాయకులు అడ్డం పడ్డారు కోర్టు కేసు వేశారు.సొంత లాభం కాదు పట్టణ అభివ్రుద్ది కోసం పని చేసి, అందరి పెండింగ్ బకాయిలు అందేలా చొరవ తీసుకున్నా. ముఖ్యమంత్రి చొరవతో 62.5 కోట్ల UIDF నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిధులు జగిత్యాల పట్టణానికి తీసుకురావడం జరిగింది.హరిని ఎంటర్ప్రైజెస్ 7 కోట్ల 3 లక్షలు సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు టెండర్ వేశారు వారు జీవన్ రెడ్డి అనుచరులు అని అందరికీ తెలుసు..కానీ పట్టణ అభివ్రుద్ది నాకు ముఖ్యం కాంట్రాక్టర్ ల గురించి ఆలోచన నాకు అవసరం లేదు.*కాంగ్రెస్ లో కలిసి పనిచేస్తూ గత ప్రభుత్వాన్ని ఎన్నడు విమర్శించలేదు*కాంగ్రెస్ ప్రభుత్వం తో కలిసి పనిచేసి 235 కోట్ల ఆసుపత్రి జగిత్యాల కు మంజూరు చేయటం జరిగింది.పక్క జిల్లాలకు నూతన ఆసుపత్రి వచ్చిందా అని అన్నారు.మెడికల్ కాలేజీ కి 41 కోట్ల పెండింగ్ బకాయి నిధులు మంజూరు చేయగా నేడు త్వరిత గతిన పనులు జరుగుతున్నాయి.మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాల తో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం.*గెలిపించిన ప్రజలకు అభివ్రుద్ది చేసి రుణం తీర్చుకుంట*ప్రజల ప్రేమ తో నా గెలుపు సాధ్యం అయింది.200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయింది.నీటి పారుదల శాఖ మంత్రి వద్ద స్థలం విషయం లో పెండింగ్ లో ఉంది.ముఖ్యమంత్రి 5 కోట్ల SDF నిధులు మంజూరు చేయటం జరిగింది.ప్రభుత్వంలో కలిసి పని చేయని నియోజకవర్గాలకు మంజూరు కాలేదనీ జగిత్యాల అభివ్రుద్ది నా లక్ష్యం అన్నారు.యావర్ రోడ్డు విస్తరణ విషయంలో పెట్రోల్ బంక్ విషయంలో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.యావర్ రోడ్డు ధర్మపురి రోడ్డులో రెసిడెన్షియల్ జోన్ లకు కమర్షియల్ నిర్మాణాలు అనుమతులు ఎవరి హయంలో ఇచ్చారో ప్రజలకు తెలుసు.2021 లో యావర్ రోడ్డును 100 ఫీట్ ల రోడ్డు గా చేసి జోన్ల మార్పు చేయటం జరిగింది.*ప్రజా ప్రతినిధులు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేయాలి*యావర్ రోడ్డు లో ప్రభుత్వ స్థలాలు 100 ఫీట్లు వెడల్పు చేయటం జరిగింది.యావర్ రోడ్డు వెడల్పు కు కట్టుబడి ఉన్నా,ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉన్న అభ్యర్థులను గెలిపిస్తే అభివ్రుద్ది సాధ్యం అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.నేను బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నా అన్నారు.ముఖ్యమంత్రి ని నిధుల కోసం కలిస్తే బి అర్ ఎస్ పార్టీ వాళ్ళు నానా హైరానా చేసి నా ఇల్లు హాస్పిటల్ పై దాడి చేశారు కనీసం వివరణ కూడా కోరలేదు.అనర్హత కు స్పీకర్ దగ్గర పిటిషన్ వేశారు అన్నారు.బి అర్ ఎస్ పార్టీ కి మొన్నటి వరకు నెలకు 5వేల పార్టీ ఫండ్ కూడా ఇచ్చాను.నన్ను ఎన్ని విమర్శించినా…రాష్ట్ర బి అర్ ఎస్ అధిష్టానాన్ని ఎన్నడూ విమర్శించలేదు.*జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి నాకు ముఖ్యం*నా ఆరాటం పోరాటం జగిత్యాల అభివ్రుద్ది కోసమే ప్రభుత్వం తో కలిసి పనిచేస్తా,మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం తో కలిసి పని చేసే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News