Monday, March 16, 2026

*నా రాజీనామాకు కారణం ‘అదే’.!** ఎమ్మెల్యే సంజయ్ తెర వెనుక రాజకీయాలు భరించలేకే బయటకు* మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి* బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి సంచలన వ్యాఖ్యలు*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్ మీట్ నిర్వహించారు. పట్టణంలో సంచలనంగా రూ.100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై ఆమె స్పందించారు.*పెట్రోల్ పంపు వ్యవహారమే రాజీనామాకు కారణం*తాను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే పెట్రోల్ పంపు భూకబ్జా విషయంలో మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. ఒక దశలో చైర్‌పర్సన్‌గా తన రాజీనామాకు ఈ పెట్రోల్ పంపు వ్యవహారమే కారణమని తెలిపారు. గతంలోనే రెండు మూడు సందర్భాల్లో తన రాజీనామాకు ముందు, ఆ తర్వాత కూడా తాను మున్సిపల్ భూమి కబ్జాతో పాటు పెట్రోల్ పంప్ వ్యవహారం పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.*డివైడర్ మార్చించి భూమి కబ్జాకు సహకారం*యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్రయత్నంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడుతున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్ అండ్ బి ఆఫీస్ సైడ్ అలైన్‌మెంట్ చేయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందనే ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. ఒక దశలో మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని సైతం మార్చి కట్టేలా చేసారని వెల్లడించారు.*నడిరోడ్డుపై నిలబెట్టి ఒత్తిడి చేశారు*కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు అప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నన్ను నడిరోడ్డు పైన నిలబెట్టి ‘ఇది మా వ్యక్తిగత విషయం, నువ్వు తలదూర్చకు’అని ఒత్తిడి తీసుకువచ్చారని శ్రావణి పేర్కొన్నారు.’పెట్రోల్ పంపుకు అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆ రోజే నా మీద ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఏమిటి?’అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. నిజాలు తెలిసి కూడా ఆయన తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.*’కిబాల పత్రం’ ఓ అనుమానాస్పదం*’1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన ముగిసి 1949లో ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే, 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం కొన్నట్టు ఎలా చెప్పగలుగుతున్నారు?’అని ప్రశ్నించారు.ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని, సందేహాస్పదంగా ఉన్న ‘కిబాల పత్రా’న్ని అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.*మున్సిపల్ రికార్డుల్లో ఆధారాలు లేవు*తాను చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్ కార్యాలయంలో లభించలేదని తెలిపారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయమని అన్నారు.*మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ అవసరం*మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని శ్రావణి సూచించారు.ప్రజల ఆస్తి ప్రజలకు చెందేలా చేయాలని, ఇందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారం ఉంటుందని తెలిపారు.*ఎంపీ తెచ్చిన ఫండ్స్‌పై ఎమ్మెల్యే తప్పుడు క్రెడిట్*ఇక ఇటీవల అర్బన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఫండ్స్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే తానే తీసుకువచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.’అభివృద్ధి చేయండి హర్షిస్తాం, కానీ ఇతరుల కృషిని తమదిగా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్?’అని ప్రశ్నించారు.*జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చే కృషి*జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయంను తీసుకువచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, బొడ్డు పెద్ద గంగారం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, సాంబారి కళావతి, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, మర్రిపల్లి సాగర్, ఇట్యాల రాము, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, బద్దెల గంగరాజం తదితరులు పాల్గొన్నారు.________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News