Saturday, January 17, 2026

*నిత్యం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే పులివర్తి నాని**చిన్నగొట్టిగళ్ళు,యర్రావారిపాల్యం మండలాలలో పాడి రైతులకు పశువులదాన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని**ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిన్నగొట్టిగళ్ళు,*చిన్నగొట్టిగళ్ళు, యర్రావారిపాల్యం మండలాలలోని వ్యవసాయ కార్యాలయాలలో రైతులకు సబ్సిడీ ద్వారా పశువుల దాన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయనకు ఘన స్వాగతం పలికిన మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం.చిన్నగొట్టిగళ్ళు, యర్రావారిపాలెం మండలాల రైతులకు సబ్సిడీ ద్వారా పశువుల దాన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి పాడి పరిశ్రమ మరియు రైతులను ఆదుకునే దిశగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగా శుక్రవారం చిన్నగొట్టిగళ్ళు వ్యవసాయ కార్యాలయంలో చిన్నగొట్టిగళ్ళు, యర్రవారిపాలెం మండలాల రైతులకు పశువుల దాన పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 2940 దాన మూటలకు గాను చిన్నగొట్టిగళ్ళు మండలానికి 465,యర్రవారిపాలెం మండలానికి 445 మూటలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది అని ఎమ్మెల్యే గారు తెలిపారు.50 కేజీల మూట ధర 1,110 గాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతుకు 555 రూపాయలకే అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ పాలనలో రైతులను గాలికి వదిలేసిన గత పాలకులు. గత ప్రభుత్వంలో స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ పార్టీ నాయకులకు మాత్రమే పశువుల దాన, పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులు ఇతర వస్తువులు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతును లక్షాధికారిగా చేసే విధంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం. ఎలక్షన్ సమయంలో రైతులకు విడతల వారిగా అన్నదాత సుఖీభవ పథకం ఇస్తానని తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్, నవంబర్ లో రౌండు విడతలు అన్నదాత సుఖీభవ పథకం 14,000 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం ఫిబ్రవరి లో మరో 6000 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News