నేటి సాక్షి 25 ఫిబ్రవరి పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడుకు చెందిన నిత్య సమాజ సేవకుడు కలబండి.నాగరాజుకు ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు, జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ముస్లిం మైనార్టీ సంఘం మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, సేవా భారతి (వై.ఆర్.డి.ఎస్) అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితర నాయకులతో కలిసి శాలువా కప్పి, పూలమాల మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న, డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు, ముస్లిం మైనార్టీ సంఘం మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు ఆర్.మురళీమోహన్, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితర నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కే.నాగరాజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కొరకు, చెంచు గిరిజనుల జీవనోపాధి కొరకు అధికారులతో, ప్రజా ప్రతినిధులతో వినతి పత్రాలు అందించి ఉపాధి హామీ పనులను కల్పించడం, వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం, వారికి ఆర్థిక సహకారం అందించడం, మతసామరస్యం కోసం, స్వాతంత్రం కోసం, విముక్తి కోసం కృషిచేసిన మహానుభావుల జయంతిలు, వర్ధంతిలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం వంటి అనేక అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ప్రేమ వివాహాల సమస్యలను, కుటుంబాల సమస్యలను, ఆస్తుల సమస్యలను ఒక పెద్ద మనిషిగా ఆయన సామరస్యంతో పరిష్కారం చేయడం జరిగిందన్నారు. మొత్తానికి సమాజ సేవకుడు కె.నాగరాజు బహుజనుల రాజ్యాధికారం కొరకు కృషి చేయడం అనేది అందరికీ ఆదర్శమన్నారు. కనుక మనమందరము ఆయన మాదిరిగానే కులవతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా, మానవత్వంతో, మతసామరస్యంతో కలిసి వెలిసి ఉండి, ఏకమై ఈ దేశంలో రాజ్యమేలుతున్న మూఢనమ్మకాలను, మూఢాచారాలను, వివక్షతలను రూపుమాపి, నియంతల పాలనకు స్వస్తి పలకాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తేనె.మల్లికార్జున, మైమాకర్, ప్రసాద్, శాలు భాష, చిన్న ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.





