నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
నిబంధనలు అతిక్రమించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని బుధవారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పడగొట్టారు. నగరంలోని ఎర్రమిట్ట రాయల్ నగర్ నందు 30 అంకణాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాన్ని కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల మేరకు డీసీపీ ఖాన్ ఆధ్వర్యంలో ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నిర్మాణాలను తొలగించారు. మూడు అంతస్తులకు అనుమతి ఉండగా అదనంగా రెండు అంతస్తులు నిర్మించడంతో అదనపు నిర్మాణాలను బుధవారం తొలగించటం ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి మూడు అంతస్తులను తొలగిస్తామని అధికారులు తెలిపారు. నగరంలో అనుమతి , ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి మూర్తి, ప్లానింగ్ సెక్రటరీ తదితరులు ఉన్నారు.