*నేటీ సాక్షి సిరిసిల శివకుమార్* ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ నిర్వహించి, నిబంధనలకు అనుసరించి ప్రైవేట్ ఆస్పత్రిలో రోగులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులకు సూచిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆసుపత్రులను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హాస్పటల్ నిర్వాహకులకు సూచించడం అయినది. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వైద్యాధికారుల సమావేశంలో వందరోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మండల వైద్యాధికారులతో మార్చి( 4) నాలుగో తేదీ నుంచి జూన్ 9 (వంద రోజుల వరకు ) నిర్వహించే నాలుగు దశల్లో హెల్త్ మిషన్ ఆరోగ్య శిబిరాలలో మహిళలకు 30 సంవత్సరాల పైబడిన మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు నిర్వహించే అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు మధుమేహం గర్భాశయ, నోటి, రొమ్ము క్యాన్సర్ల వంటి సంబంధిత పరీక్షల లతోపాటు, క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం తో పాటు, గర్భిణీ స్త్రీల పరీక్షలు, పిల్లల తల్లులు పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలు ఉంటాయని మండల వైద్యాధికారులకు ముందస్తు శిక్షణ ఇవ్వడం జరిగింది.





