*యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం**కేంద్ర ప్రభుత్వం నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్ తో పాటు మరో 8 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి వినూత్న రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వినూత్న రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు లేకుండా ఆంక్షలు, అరెస్ట్ లు చెయ్యడం విచారకరం అన్నారు.యువజన కాంగ్రెస్ నేతల అరెస్ట్ కేంద్ర ప్రభుత్వం నియంత్రత్వ ధోరణి నిదర్శనం అన్నారు. జాతి ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై యూత్ కాంగ్రెస్ పోరాట స్ఫూర్తి హర్షనీయం అన్నారు. యువత, ప్రజల పక్షాన ఉంటూ ప్రజాపోరాటాల్లో భాగస్వామ్యం అవుతామని, అరెస్ట్ లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను విడనాడాలని వినూత్న రెడ్డి డిమాండ్ చేశారు.





