*(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 13:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ కమర్షియల్ డైరెక్టర్ చిలకమర్రి చక్రపాణి గురువారం తుక్కుగూడలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నిరంతరమైన,నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.వచ్చే వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు,అధిక సామర్థ్యంతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్లు,కొత్త లైన్లు,సబ్‌స్టేషన్లు నిర్మాణం చేపట్టుతున్నామని చెప్పారు.విద్యుత్ సిబ్బంది భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జోన్ చీఫ్ ఇంజనీర్ పాండ్య,రాజేంద్రనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్,కందుకూరు డీఈ గోపాలకృష్ణ,మామిడి పల్లి ఏడీఈ శంకర్,మహేశ్వరం ఏఈ చక్రపాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.





