Monday, March 16, 2026

*నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలి – ఎం ఎల్ ఏ డాక్టర్ సంజయ్ కుమార్*—————————————-జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………….. *మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం*ప్రజా జీవితం లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.70 ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన నాపై ఆరోపణలు అర్థరహితం ఆది వారి విజ్ఞతకే వదిలేస్తున్న.జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదు. నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంబానీకి వెళ్లారు.మాజీ మంత్రివర్యులు కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేశారు.నా పై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా,ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలీ. చట్ట వ్యతిరేక విధానాలకు మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు ఉండదు.నా జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు.బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఏ విషయం లో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తా అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని కోరుతున్న,అన్ని వేళలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు అండగా ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News