నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)నిరుపేదలకు సిఎం సహాయానిధి ఒక వరం అని బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మ అన్నారు.బాపట్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 84 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీయం సహాయ నిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగానిలుస్తుందని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని,అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీయం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల అధ్యక్షులు, కర్లపాలెం మండల పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.





