నేటి సాక్షి నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా తన తల్లి బండారి రాజేశ్వరి జ్ఞాపకార్థం ట్రస్ట్ స్థాపించినట్లు బండారి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన 30మంది నిరుపేదలకు శ్రీ కిరణ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ పాశం మహేష్ చే ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి, మందులు అందజేసినట్లు ఆయన తెలిపారు. గతంలోనూ బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులతో పాటు పలువురికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించామని, రానున్న రోజుల్లోనూ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





