నేటి సాక్షి మంచిర్యాల్ మార్చి 9 శ్రీధర్ దమ్మమంచిర్యాల్ జిల్లా బెల్లంపల్లి పట్టణ మున్సిపాలిటీ 3వ వార్డు (అంబేద్కర్ నగర్)లో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి *5వేల రూపాయల ఆర్థిక సహాయం* అందించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు.* *బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలొ ప్రకటించిన మేనిఫెస్టో* లో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చిన గౌరవ కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు* బెల్లంపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు అంబేద్కర్ నగర్‌కు చెందిన *ఎటకారి పద్మ* మరణించిన నేపథ్యంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ అక్కడికి చేరుకుని మృతదేహానికి పూల మాల సమర్పించి శోక త్రాప్తా హృదయలతో హార్దిక నివాళులర్పించారు. *ఎన్నికల మేనిఫెస్టో* లో నిరుపేద ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారంగా అకాల మరణం చేసిన *ఎటకారి పద్మ* కుటుంబానికి *ఐదు వేల రూపాయలు* దహన సంస్కారాలకు తక్షణ సహాయం గా తన స్వంత డబ్బులను అందజేసిన మూడవ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు. ఇదే విధంగా ఏ నిరుపేద కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా ఇలాగే నా సహాయం అనేది కొనసాగుతూ ఉంటుంది అని తెలపడం జరిగింది.*ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా మీ వంతు సహాయం చేయగలరని కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ కోరడం జరిగినది.* గత ఇరవై సంవత్సరాలలో ఏ నాయకుడు చేయని విధంగా నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తూ అండగా ఉంటున్నటువంటి 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారిని ప్రజలు అభినందిస్తున్నారు.





