నేటి సాక్షి, జనవరి 09 (ఎండపల్లి):* జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు.. వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై పి.ఉదయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం చైనా మాంజా విక్రయాలపై నిషాదంను కొనసాగిస్తూ పలు గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చైనా మాంజా వినియోగించడం వల్ల మనుషులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు, చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని దుకాణదారులకు అవగాహన కల్పించి, నిషేధిత చైనా మాంజాను ఎవరైనా విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

