Tuesday, March 17, 2026

నిస్సహాయ స్థితిలో నిరుపేద ముస్లిం కుటుంబం..బ్రెయిన్ స్ట్రోక్ తో చావు బతుకుల మధ్య కొట్టుమిడుతున్న కుమారుడిని బెంగళూరు లోని ఆస్పత్రిలో తరలింపు..ఆపన హస్తం కోసం కుటుంబం ఎదురుచూపు..కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి యువకుడి ప్రాణాలను కాపాడాలని వేడుకొంటున్న గ్రామస్తులు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 24 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన సోంపల్లి గ్రామపంచాయతీ పాతకోట గ్రామంలోని మైనార్టీ కాలనీకి చెందిన పఠాన్ ఖాసీం, షమీరా పఠాన్ వీరిది రెక్కాడితే డొక్కాడని నిరుపేద ముస్లిం కుటుంబం. వీరికి ముగ్గురు కొడుకులు. చివరి అబ్బాయి పఠాన్ నసీర్ ఖాన్ కు మంగళవారం అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆస్పత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిడుతున్నాడు. గ్రామంలో కొందరు సహకారం అందించడంతో వారు కొద్దిగా పోగు చేసుకున్న డబ్బులను తీసుకొని వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోగానే వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి రూ. 3 లక్షలు బిల్లు వేశారు. తల్లితండ్రుల రోదనను చూసిన పలువురు చలించి పోయారు. వీరి బిడ్డను కాపాడుకునేందుకు ఆపన హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కుల మతాలకతీతంగా పార్టీలకతీతంగా పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహకారం అందించాలని వేడుకుంటున్నారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని బిడ్డను కాపాడాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. వీరి వేదనను ఆలకించి కూటమి ప్రభుత్వం తక్షణమే వైద్య ఖర్చులకు సహాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీరి కుటుంబ పరంగా అంత ఆర్థిక స్తోమత లేదని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అంతలోనే ఆ యువకుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో ఆ కుటుంబం మరింత క్షోభకు గురవుతావుందని కూటమి ప్రభుత్వం తక్షణమే వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ యువకుడు ఆరోగ్యం కుదుటపడేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. ~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News