Monday, December 23, 2024

నీట్​ లాంగ్​ టర్మ్ ఫ్రీ కోచింగ్​

నేటి సాక్షి, కొత్తగూడెం: 2024 – నీట్​లో అర్హత సాధించని షెడ్యూల్డ్ కులాల విద్యార్దిని, విద్యార్దులకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైద్రాబాద్ వారు అందిస్తున్న నీట్ – 2025 లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో ఎస్సీలకు 334, బీసీలకు 8, ఓసీలకు 8 చొప్పున సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు తమ‌ వివరాలను www.tgswreis.telangana.gov.in వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు హైదరాబాద్లో​ని TGSWR COE గౌలిదొడ్డి, నార్సింగి, చిలుకూరు, మహేంద్ర హిల్స్ గురుకులాలలో ఉచిత శిక్షణ అందిస్తారని తెలిపారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, NEET 2024 పరీక్షను విధిగా రాసిన వారు మాత్రమే ఈ ఉచిత శిక్షణ పొందటానికి అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తు రుసుము రూ.200 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం 8520860785 సంప్రదించాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News