Monday, December 23, 2024

నీట్​–2024లో అల్ఫోర్స్​ అఖండ విజయం

నేటి సాక్షి, కరీంనగర్​: ఇటీవల ప్రకటించిన నీట్-2024 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యధ్బుత మార్కులు సాధించారు. ఎన్ హేమంత్ 691 మార్కులు సాధించగా, వీ హాసిని 671, డీ పూజిత 650, ఎన్ కౌశిక్ రెడ్డి 647, పీ అక్షరరెడ్డి 639, వీ శ్రీముఖి 619, మరియాసబ 619, ఏ శ్రీవర్థిని 613, ఎం కమాలికాప్రీతి 613, ఎన్ జ్ఞానద 604, ఏ అమరేందర్ 598, బీ హాసిత 595, కే శ్రీవిద్య 582, ఎండీ అఫ్ఘాన్​ ఖాన్ 579, ఎన్ సాయిప్రతిజ్ఞ 573, ఎం ప్రతిమ 571, పీ శ్రీనాథ్ 566, షేక్ ఉమ్రా 561, తేజస్వీని 560, మాహిన్​ నజ్మీన్ 560 మార్కులు సాధించారు. పీడబ్ల్యూడీ కేటగిరిలో జాతీయస్థాయిలో కే సుహృదాఘవ 675వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అల్ఫోర్స్​ విద్యా సంస్థల చైర్మన్​ వీ నరేందర్​రెడ్డి మాట్లాడుతూ నీట్ కోచింగ్లో డాక్టర్స్​-30 ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా కోచింగ్​ను అందించిన రెండో సంవత్సరములో ఆల్ఫోర్స్ విజయపరంపర కొనసాగిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. 10 మంది విద్యార్థులు 600లకు పైగా మార్కులు, 20 మంది విద్యార్థులు 560పై మార్కులు, 41 మంది విద్యార్థులు 500పై మార్కులు, 86 మంది విద్యార్థులు 450పై మార్కులు సాధించడము విశేషమని గర్వంగా చెప్పారు. సుమారుగా 130 మంది విద్యార్థులు వివిధ ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించగలరని చెప్పారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంటిత దీక్ష, పట్టుదల, కృషితో ఇంతటి ఘన విజయం సాధించినట్టు చెప్పారు. తక్కువ మంది విద్యార్థులతో అధిక సీట్లు సాధించడం అల్ఫోర్స్ విజయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నీట్ అయినా, ఐఐటీ అయినా విద్యార్థులను విజయమార్గంలో నడిపిస్తున్న సంస్థ అల్ఫోర్స్ అని ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రకటించిన అన్ని ఫలితాల్లో అల్ఫోర్స్ ముందంజలో ఉందని గర్వంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రములో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్ను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ తమ పిల్లలను అల్ఫోర్స్ చేర్పిస్తున్నందుకు వారికి మన స్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. రాబోయే కాలములో అత్యధిక మంది విద్యార్థులను మెడికల్, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ అణిముత్యాలను అభినందిస్తున్నట్టు చెప్పారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News