Thursday, March 12, 2026

నీట్ 2025లో ఆక్స్ఫర్డ్ & అభ్యాస స్కూల్ విద్యార్థుల విజయ గాథ

(జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)……(అక్టోబర్ 13):జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా, *ఆక్స్ఫర్డ్ మరియు అభ్యాస స్కూల్* విద్యార్థులు.ఇటీవల వెలువడిన *NEET 2025* ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. ప్రముఖ మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందడం ద్వారా తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. గౌరిశెట్టి సమన్వి – సింగరేణి మెడికల్ కాలేజ్, రామగుండం, బండారి నిక్షిప్త– గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జగిత్యాల, మోర ప్రద్యుమ్న్ – C.M.R మెడికల్ కాలేజ్, హైదరాబాద్ లో సీట్లు సాధించారు.ఈ విజయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు పాఠశాల కరస్పాండెంట్ భోగ రవిప్రసాద్ – శ్రీదేవి గారు,ఆధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ –రానున్న రోజుల్లో మన *ఆక్స్ఫర్డ్ & అభ్యాస స్కూల్స్* నిజమైన *డాక్టర్స్ ఫ్యాక్టరీగా* మారబోతున్నాయి. ప్రతి సంవత్సరం విద్యార్థులు తమ మొదటి ప్రయత్నంలోనే మెడికల్ సీట్లు సాధించడం పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం,” అని గర్వంగా తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News