నేటి సాక్షి,వేమనపల్లినీల్వాయి పోలీస్ స్టేషన్ లో శనివారం ఎస్ఐ శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక మానవ జీవితం కాలంతోపాటు వేగంగా ప్రయాణిస్తుందని,దీంతో అనేక అనారోగ్య సమస్యలు,మానసిక సమస్యలు దరిచేరుతున్నాయని,వీటిని అధిగమించడానికి యోగ సరైన మార్గమని సూచించారు.విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా సాధన చేసినట్లయితే శారీరక ఆరోగ్యం మెరుగుకావడతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు.కళాశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు డా.మల్లేష్ విద్యార్థులతోపాటు అధ్యాపకుల చేత పలు యోగాసనాలను వేయించి వాటి ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు సంధ్యారాణి,ఎంపిడిఓ కుమారస్వామి,నీల్వాయి కాంప్లెక్స్ హెచ్ఎం గిరిధర్ రెడ్డి,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డా.రాజేష్,ఏఈ పీఆర్ డేవిడ్ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి అశోక్,అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

