Tuesday, March 10, 2026

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మండల అధ్యక్షుడు తూం జలపతి..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )

రుద్రంగి మండల నూతన ఎస్సై గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ జక్కు వంశీ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆదివారం రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి మాట్లాడుతూ… రుద్రంగి మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు.

నూతన ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మత్తు, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో 100 డయల్ కు ఫోన్ చేయాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News