నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలో గల గాంధీ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు పాలకవవర్గం, అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాలకవర్గానికి మరియు మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాలకవర్గానికి మరియు మిర్యాలగూడ మండలం భల్లు నాయక్ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పాలకవర్గానికి, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందినందున వారందరికీ శాలువాతో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎండి. యూసుఫ్, ఆంగోతు హాతిరాం నాయక్, ధనావత్ బాలాజీ నాయక్, కుర్ర సేవియా నాయక్, కొత్త మర్రెడ్డి ల్, కుర్ర శ్రీను నాయక్, సైదులు రెడ్డి, కుర్ర కాంతి కృష్ణ కాంత్ నాయక్, మాలావత్ రవీందర్ నాయక్ పెరుమాళ్ళ శ్రీనివాస్, బండి వెంకటేశ్వర్లు, ధనావత్ ప్రకాష్ నాయక్, కనిగిరి శ్రీనివాస్, ఊట్కూరి లింగారెడ్డి, సచిన్ నాయక్, రమావత్ వినోద్ నాయక్, గుండా సీతారాములు, రమేష్ నాయక్, అనిల్ నాయక్, బుజ్జి బాబు నాయక్, గూగులోతు కిషన్ నాయక్, నాగు నాయక్ తదితరులు ఉన్నారు.





