నేటి సాక్షి నారాయణపేట, మార్చి 20, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ )నారాయణపేట జిల్లాకు ఇటీవల నూతనంగా నియమితులైన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు జిల్లా పరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు. జిల్లాలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పని చేసిజిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా పరిపాలన మరియు పోలీస్ శాఖలు సమిష్టిగా కృషి చేస్తామని నూతన కలెక్టర్ నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.





