నేటి సాక్షి,వేమనపల్లి;
బద్దంపల్లి గ్రామంలో నీటి ఎద్దడి గురించి గ్రామస్థులు మాజీ జడ్పీటీసీ ఆర్.సంతోష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా,వారు వెంటనే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలియజేయగా వెంటనే గ్రామానికి నీటి ఎద్దడి నివారణ నిమిత్తం ఎమ్మెల్యే నిధులనుండి రూ.4 లక్షలతో నూతనంగా రెండు బోర్లు వేయించి వాటికి రెండు కొత్త మోటర్లను శుక్రవారం బిగించారు.చెప్పిన వెంటనే నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు కృతఙ్ఞతలు తెలుయజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కొరకొప్పుల రమేష్ గౌడ్,మానిపెళ్లి బాపు,కోర్తే రవీందర్,మానేపెల్లి సమ్మయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.

