నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 30, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిపి కోఆప్షన్ నెంబర్లను నియమించాలని ప్రకటన ఇచ్చింది. అందుకు తగిన చట్టం పంచాయతీరాజ్ చట్టంలో రూపకల్పన చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తులో విజయం సాధించింది. 30% బిఆర్ఎస్, బిజెపి, అభ్యర్థులు విజయం సాధించి సర్పంచ్ పదవులను కైవాసం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆలోచన వల్ల గ్రామాలలో అలజడులు జరిగే ప్రమాదం ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నూతన సర్పంచులు అభిప్రాయపడుతున్నట్లు గ్రామాలలో తెలిసింది. ఇంతవరకు మండల పరిషత్ లో కో- ఆప్షన్ నెంబర్ ను కొనసాగితే వచ్చారు. వారు మాకు ఎలాంటి అధికారాలు లేవని చెబుతుండగా ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీలో జిపి లలో కోఆప్షన్ను ఎందుకు నియమిస్తున్నారని పలు గ్రామాలలో ఎన్నికైన నూతన సర్పంచులు చర్చించుకుంటున్నారు. గ్రామపంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు పార్టీల మద్దతు విజయం సాధించారు ఇందులో వ్యక్తిగతంగా ఎవరు మంచివారో వారికే ఓటు వేసి గెలిపించడం జరిగింది. కొన్ని గ్రామాలలో నూతన సర్పంచులు టిఆర్ఎస్ వారు ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతు నిలబడిన ప్రజలు వారిని ఖాతరు చేయలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో టిఆర్ఎస్ టిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలవడం ప్రశ్నార్థంగా మారిందని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు వారి మంచితనం వల్ల పలు గ్రామాలలో విజయం సాధించారు కనుక ఓటమిపాలైన అధికార పార్టీ సర్పంచుల అభ్యర్థులకే కో ఆప్షన్ పదవులను కట్టబెట్టాలని ఆలోచనలో సరైంది కాదని కట్టబెట్టాలని ఆలోచన సరైంది కాదని విద్యావంతులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని పలు రాజకీయ పార్టీల ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చట్టాన్ని పంచాయతీరాజులో చట్టంతో తీసుకొని రావడం అనే ఆలోచన సరైనది కాదని అలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏర్పడే ప్రమాదం ఉందని గ్రామాలలో చిచ్చు పెట్టడం వంటి ఆలోచనల విరమించుకోవాలని పలు రాజకీయ పార్టీల విశ్లేషకులు అభిప్రాయం వెలబుచ్చారు. పేట జిల్లాలో పలు గ్రామాలలో నూతన సర్పంచులు గందరగోళంలో పడినట్లు చర్చించుకుంటున్నట్లు తెలిసింది.

