నేటి సాక్షి, కరీంనగర్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

