Thursday, March 19, 2026

నూతన సర్పంచ్ఉపసర్పంచ్‌లకు డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క సన్మానంబిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 15జైనూర్: జైనూర్ మండలం గౌరీ కొళాంగూడ నూతన సర్పంచ్ ఆత్రం అయ్యుబాయి, ఉపసర్పంచ్ షేక్ ఫైజల్‌తో పాటు పలువురు వార్డు సభ్యులను లేండి గూడాలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన ప్రజాప్రతినిధులను శాలువాలు కప్పి అభినందించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చేలా నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు పాలన సాగించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి,మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ విజయోత్సవ సభలో పలువురు.బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి సుగుణక్క పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం భుజంగరావు, సీనియర్ నాయకులు షేక్ రషీద్, మండల ఉపాధ్యక్షుడు పేందూర్ ప్రకాష్,మాజీ ఎంపిటిసి యశ్వంత్ రావ్, హజ్జులాల,సుద్దాల శ్రీనివాస్,సుద్దాల ఆనంద్, అప్రోజ్, గణపతి, ఫైజల్ ఖాన్, హైదర్, దత్తు,ఆత్రం బాపూరావు,షాకీర్, తాజ్,మహేష్, కాంగ్రెస్ పార్టీలో చేరిన ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News