*మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న పరిశ్రమలు నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళాభివృద్ధి కోసం గత ఆయన పరిపాలన లోనే మహిళా సంఘాలు ప్రవేశపెట్టారని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పడానికే పెరటి కోళ్ళు పెంపకం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిన్నబాబు అన్నారు బుధవారం స్థానిక రామచంద్రపురం మండలం మండల మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి చెందుతుందని, ప్రభుత్వం మహిళల స్వావలంబన న కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని ఈ పథకాలన్నీ మహిళలు వినియోగించుకోవాలని కొనియాడారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల తిరుమల రెడ్డి మాట్లాడుతూ మహిళలు రక్తహీనత లేకుండా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని తద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. మండలంలో పెరటి కోళ్లు 100 యూనిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు సింగల్ విండో చైర్మన్ చేకూరి జనార్ధన చౌదరి, ప్రధాన కార్యదర్శి రావిళ్ళ గిరిబాబు,సీనియర్ నాయకులు కొట్టే నర్సింహారెడ్డి, వెటర్నరీ డిపార్ట్మెంట్ జయ కిషోర్ రెడ్డి , భువనేశ్వరి , ఏపీఎం గురుమూర్తి సిసి లు పార్వతమ్మ, సుధాకర్, అకౌంటెంట్ స్వర్ణలత, మండల సమాఖ్య అధ్యక్షులు మహాలక్ష్మి, కార్యదర్శి అరుణ, కోశాధికారి హరిత, మరియు సంఘమిత్రలు పాల్గొన్నారు.





