Wednesday, March 4, 2026

*నేటి నుండి నాగులమ్మ మహా జాతర* ఆదివాసీ పూజారులు వడ్డే లతో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు శ్రీ నాగులమ్మ తల్లిని తర తరాలుగా ప్రకృతి దేవత గా ఆరాధిస్తున్న ఆదివాసీ పూజారులు కార్యక్రమాలను వెల్లడించిన బాడిశ రామకృష్ణ స్వామి

నేటిసాక్షి/మంగపేట ములుగు జిల్లా మంగపేట మండలంలో వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీనర్సా పూర్ గ్రామంలో శ్రీ నాగులమ్మ మహా జాతర ఐదు రోజుల పాటు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహించ నున్నారు .ప్రతి రెండేళ్ల కోసారి పాల్గుణ శుద్ధ పౌర్ణమి వారంలో జాతర నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది పూజ కార్యక్రమ వివరాలను నాగులమ్మ మహా జాతర ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ తెలియ జేసారు మార్చ్ 3న మండె మెలుగుట కార్యక్రమంతో జాతర ప్రారంభమై 4న బుధవారం శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండోర్రె గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు అదే సమయంలో యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజలు చేసి నాగులమ్మ సడాలమ్మ అమ్మవార్లను రమణక్క పేట దగ్గర వున్న గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు చేపించి నాగులమ్మ ఆలయం వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు 5న నిండు జాతర జరుగుతుంది అందులో భాగంగా సాయంత్రం 3 గంటలకు రాజుపేట సెంటర్ నందు పాలమాకు వొర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం(వనదేవత) కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదురుకోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు రాత్రి 12:05 నిమిషాలకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని యాశాస్త్రోక్తం గా గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు జాతర లో ముఖ్య ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం తెల్ల వారు జామున 3 గంటల సమయంలో నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి లోక కళ్యాణం కోసం అగ్ని గుండాలలో నడవడం జరుగుతుంది 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుట జరుగుతుందని మార్చి 7 న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జాతర ముగుస్తుందనీ శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News