నేటిసాక్షి, మిర్యాలగూడ : నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలవుతారని,విద్యార్థుల్లో ప్రయోగలపట్ల చిన్ననాటి నుంచే ఆసక్తిని పెంచుతాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని రెడ్డి కాలనీలోని డౌహిల్ పాఠశాల మరియు క్రిష్ణ కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్ లలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు రూపొందించిన నమూనాలను, పరిశోధనలను చూసి, ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ 1928 ఫిబ్రవరి 28న తన ప్రసిద్ధ పరిశోధన “రామన్ ఎఫెక్ట్” కనుగొన్నందుకు గుర్తుగా, జాతీయ సైన్స్ దినోత్సవంగా ఎంచుకున్నారని,మానవాళి అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, స్కూల్స్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, కాంగ్రెస్ నాయకులు దేశిది శేఖర్ రెడ్డి, కార్యకర్తలు, మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.





