‘ఆ-అమీన్ సాబ్’కి రాంరాం.!
* కోరుట్ల ఎస్ఐ’తోపాటు మరో 7 గురుకీ స్థానచలనం
నేటి సాక్షి – కోరుట్ల
( రాధారపు నర్సయ్య )
‘నేటి సాక్షి’ దినపత్రికలో.. ఈనెల 18.న బుధవారం సంచికలో ‘ఆ-అమీన్ సాబ్ అంతే! అదో టైపు’.!! అన్న శీర్షికన ప్రచురితమైంది.ఈ వార్త స్థానికంగా వైరలైంది.అదే విధంగా ‘డిపార్ట్మెంట్’లోనూ చర్చానీయాంశమైనట్టు సమాచారం.జనాల భద్రత గురించి గానీ.. అసాంఘిక కార్యకలాపాలు..అరాచక శక్తులపై కమాండింగ్.. సోషల్ రెస్పాన్సిబిలిటీ.. లేకపోవడంతోపాటు..’పౌరబంధాలు..సమాచార సంబంధాలను కూడా నామమాత్రంగా కలిగివుండడం అతని ‘సమర్థత’ను సమాజానికి ‘నేటిసాక్షి’ ద్వారా స్పష్టతనిచ్చినట్టైంది.దీంతో ‘పోలీస్ ఉన్నతాధికారులు’ కూడా ఈ విషయంపై సదరు ‘అమీన్ సాబ్’పై ‘కన్నెర్ర’ చేసినట్టు సమాచారం.’డిపార్ట్మెంట్’ సైతం ఆయన కదలికలు.. పనితీరుపై ‘ఆరా’తీసి ఓ నివేదిక తయారు చేసినట్టు తెలిసింది.ఈక్రమంలో ‘ఎస్ఐ.శ్రీకాంత్’ను ఎస్ఐ విధుల నుంచి తప్పించి ఇప్పటికిప్పుడు జిల్లాలో గానీ..ఇతర జిల్లాలో గల పోలీసు స్టేషన్ లకు ఎస్ఐగా బదిలీ చేయకుండా ‘డిఎస్బి’కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మొత్తం 8 మందికి స్థానచలనం
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐలను బదిలీ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 8.మంది సబ్ ఇన్స్పెక్టర్ల (సివిల్) బదిలీలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం గురువారం రాత్రి
ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-2 బాసర డీఐజీ ఆదేశాల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది ఎస్ఐల బదిలీలు జరిగాయి. వీరిలో జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లకు చెందినవారు ఉన్నారు.
బదిలీ అయిన వారు వీరే.!
పి. గీతా : జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్
నుంచి సారంగాపూర్ పోలీసు స్టేషన్ కి.
పి. ఉదయ్ కుమార్ : ధర్మపురి పోలీసు స్టేషన్ నుంచి వెల్గటూర్ పోలీసు స్టేషన్ కి.
ఎస్. శ్రీకాంత్ : కోరుట్ల పోలీసు స్టేషన్ నుంచి డిఎస్బీ-జగిత్యాల కి.
పి. దత్తాత్రి : సారంగాపూర్ పోలీసు స్టేషన్ నుంచి డిసిఆర్బీ-జగిత్యాల కి.
సతీష్ : గొల్లపల్లి పోలీసు స్టేషన్ నుంచి డిఎస్బీ-జగిత్యాల కి.
ఆర్. ఉమాశంకర్ : వెల్గటూర్ పోలీసు స్టేషన్ నుంచి వేకెన్సీ రిజర్వ్-జగిత్యాల కి.
ఎం. చిరంజీవి : నిజామాబాద్ కమిషనరేట్ నందిపేట పోలీసు స్టేషన్ నుంచి కోరుట్ల పోలీసు స్టేషన్ కి.
ఎం. కృష్ణసాగర్ రెడ్డి : నిర్మల్ జిల్లా కడం పోలీసు స్టేషన్ నుంచి గొల్లపల్లి పోలీసు స్టేషన్ కి.. బదిలీ చేస్తూ డీఐజీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.





