నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం (07/07/2025) రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాకతీయ విశ్వ విద్యాలయంలో సోమవారం నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.





