Wednesday, March 25, 2026

నేడు నారాయణపేటలో దివ్యాంగులకు ఆటల పోటీలు

నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 28,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 29న (శనివారం) ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లాకు చెందిన దివ్యాంగులకు జూనియర్, సీనియర్ విభాగాలలో జిల్లా స్థాయి ఆటల పోటీల( క్యారమ్స్, చెస్, షాట్ పుట్, రన్నింగ్)ను నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారి సంచిత్ గంగ్వర్ తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. నేటి ఈ జిల్లా స్థాయి ఆటల పోటీలకు దివ్యాంగులు ( శారీరక, అంధ, బధిర), దివ్యాంగుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటల పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. –

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News