నేటి సాక్షి, నారాయణపేట,నవంబర్ 6, ఈ నెల 6న గురువారం మధ్యాహ్నం గం 1:00లకు ఎస్.ఆర్ .గార్డెస్ ఫంక్షన్ హాల్ నారాయణపేట, (పాత జిల్లా ఆసుపత్రి పక్కన) బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందనీ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పూజారులు,పాస్టర్స్, ఖ్వాజీలు మరియు జిల్లా లోని ఫంక్షన్ హాల్ యజమానులు. టెంట్ హౌస్ యజమానులు. సౌండ్ సిస్టమ్స్ మరియు డీజే నిర్వాహకులు క్యాటరింగ్ యజమానులు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు మరియు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు అందరు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగినది.కావున పైన పేర్కొన్న వారందరు ఈ అవగాహన సమావేశానికి తప్పక హాజరు అయ్యి విజయవంతం చేయాలని తెలియజేయనైనది.





