Thursday, March 12, 2026

నేడు మరికల్ కు పేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి రాక

నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 12, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి నరహరి నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్సులు తెలియచేస్తూ .13న .సోమవారం మధ్యాహ్నం సమయం 02.00 గంటలకు మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్. చిట్టెం.పర్ణిక రెడ్డి మరికల్ గ్రామానికి వస్తున్నారని ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి నరహరి తెలిపారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరియు మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ.కుంభం. శివకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరికల్ మండల కేంద్రములో గల జిల్లా నాయకులు శ్రీ.సూర్యమోహన్ రెడ్డి గారి నివాసములో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి ఎన్నిక పై ఉమ్మడి ధన్వాడ మండల కార్యకర్తల సమీక్ష సమావేశము (అభిప్రాయ సేకరణ) కలదు.ఇట్టి కార్యక్రమము నకు ఏఐసీసీ పరిశీలకులు శ్రీ.నారాయణ స్వామి ఎమ్మెల్సీ గారు, సికింద్రాబాద్ శాసనసభ్యులు శ్రీ గణేష్ కుమార్ గారు,రాష్ట్ర మత్స్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ.మెట్టు సాయి కుమార్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు శ్రీ.కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు విచ్చేయుచున్నారు. కావున మండలం లోని అన్ని గ్రామాల నాయకులు,కార్యకర్తలు ఇట్టి సమావేశమునకు హాజరై మీ అభిప్రాయములు తెలియచేయగలరు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News