నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 31, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని మరికల్ పెద్ద చెరువులో ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా మత్స్య కార్మికుల సంఘం నాయకులు కాని గంటి నారాయణ మరికల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మరికల్, మండల లో ని చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు మరికల్ పెద్ద చెరువు దగ్గరికి రావాలని ఆయన కోరారు. చేప పిల్లల విడుదల కార్యక్రమానికి నారాయణపేట జిల్లా మత్స్యకారులు, నాయకులు అధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు.





