నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి డిసెంబర్ 27 : తిరుచానూరు రోడ్డు మార్గంలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10గంటలకు రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం (ఆర్కేఎస్ఎస్) సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు గౌరవాధ్యక్షులు శివరామరాజు, అధ్యక్షులు బలరామరాజు, కార్యదర్శి నారాయణ బాబు రాజు మరియు కార్యనిర్వహకులు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ మాజీ జే ఈ ఓ శ్రీనివాసరాజు, పుంగనూరు వెంకటరమణ రాజు, రాజంపేట జగన్మోహన్ రాజు ముఖ్య అతిధులుగా హాజరై ఎజెండా మేరకు సభను నిర్వహించి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశానికి క్షత్రియ సోదరులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన సభ్యత్వం,రెన్యువల్స్ చేపట్టి రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం సభ్యత్వ సంఖ్యను భారీగా పెంచనున్నట్లు తెలిపారు. మహిళా మణులకు ప్రాధాన్యత ఇచ్చి క్షాత్రాణుల బలోపేతానికి కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో క్షత్రియ భవన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దానిని త్వరగా పూర్తిచేసి క్షత్రియ రాజులకు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. సర్వసభ్య సమావేశం అనంతరం విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి క్షత్రియ సోదర సోదరీమణులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

