Thursday, March 19, 2026

నేపాల్ నుంచి వచ్చిన రుద్రాక్ష వృక్షాలు – ఆరు సంవత్సరాల తర్వాత దర్శనమిచ్చిన శివ అనుగ్రహం

**నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*మండలంలోని కుప్పం గ్రామానికి చెందిన రైతు జేజిరెడ్డి పొన్నాల ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రకృతిని పూజించే ఆయన 2019 సంవత్సరంలో తన వ్యవసాయ భూమిలో రెండు రుద్రాక్ష వృక్షాలను నాటారు. ఈ పవిత్ర వృక్షాలను ఆయన అప్పట్లో నేపాల్ నుంచి తీసుకువచ్చారు. ఆది నుంచి పరమశివుడి అనుగ్రహంతో, నిత్య పూజలు–భక్తితో ఈ వృక్షాలను సంరక్షిస్తూ వచ్చారు.కాలగమనంలో ఆరు సంవత్సరాలు పూర్తయ్యాక, ఈ రుద్రాక్ష వృక్షాలు ఇప్పుడు తొలిసారిగా రుద్రాక్షలను ధరించడం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది కేవలం ప్రకృతి సంఘటన మాత్రమే కాకుండా, శివ కృపకు నిదర్శనంగా భక్తులు భావిస్తున్నారు.రుద్రాక్ష అనేది పరమశివుడి కన్నీటితో జన్మించిందన్న పురాణ విశ్వాసం ఉంది. అటువంటి పవిత్ర రుద్రాక్షలు స్వయంగా ఒక రైతు భూమిలో పుట్టడం ఆ ప్రాంతంలో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ వృక్షాల దర్శనం, రుద్రాక్షల అవతరణను శివ అనుగ్రహంగా, శుభ సూచకంగా భక్తులు భావిస్తున్నారు.ఈ సంఘటన ద్వారా భక్తి, ఓర్పు, విశ్వాసం ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహం ప్రసాదిస్తాడని జేజీ రెడ్డి పొన్నాల అనుభవం తెలియజేస్తోంది. ఇది ఆధ్యాత్మికంగా ఒక అపూర్వమైన ఘట్టంగా నిలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News