Saturday, March 14, 2026

*నేరం చేస్తే శిక్ష తప్పదు — జిల్లా ఎస్పీ అశోక్ కుమార్-ఐపీఎస్*——-*ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92 మందికి జైలు శిక్షలు జరిమానాలు విధించాయి*జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………నేర నియంత్రణలో న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా వాటిలో 92 మంది నేరస్తులకు జైలు శిక్షలు మరియు జరిమానాలు విధించబడ్డాయని ఎస్పి వివరించారు.*న్యాయస్థానాల ద్వారా విధించబడిన జైలు శిక్షల వివరాలు*హత్య కేసు లో 20 మంది నిoదితులకు జీవిత ఖైదీ విధించడం జరిగింది.20 సంవత్సరాల జైలు శిక్ష 05 మంది నిoదితుల కు,10 సంవత్సరాల జైలు శిక్ష 05 మంది నిoదితులకు,7 సంవత్సరాల జైలు శిక్ష 09 మంది నిoదితులకు,5 సంవత్సరాల జైలు శిక్ష 03 మంది నిoదితులకు,4 సంవత్సరాల జైలు శిక్ష ఒకరికి విధించడం జరిగింది.3 సంవత్సరాల జైలు శిక్ష 08 మంది నిoదితులకు,2 సంవత్సరాల జైలు శిక్ష 09 మంది నిoదితులకు,1 సంవత్సరాల జైలు శిక్ష 06 మంది నిoదితులకు విధించడం Directly. Below One Year 26 మంది నిoదితులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News