నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లా పొలిమేరల్లో నేరగాళ్ల ఆటలు ఇకపై సాగవు. అంధకారంలో అసాంఘిక పనులు చేసే వాళ్లకు, చట్టాన్ని అతిక్రమించే వాళ్లకు ఊపిరాడకుండా చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ‘డిజిటల్ కన్ను’ తెరిచింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వినూత్న ఆలోచనతో, ఇప్పుడు నింగి నుంచి డ్రోన్లు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.నింగి నుంచి నిశిత పరిశీలన..___________________________శివారు ప్రాంతాల్లో పాడుబడిన ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలే అడ్డాగా మలుచుకొని సాగే గంజాయి విక్రయాలు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు ఈ ‘నింగి కన్ను’ అడ్డుకట్ట వేయనుంది. ఎక్కడో రహస్యంగా పేకాట ఆడుతున్నా, కోడి పందాలు ఆడుతున్నా, బహిరంగంగా మద్యం సేవించినా కిలోమీటర్ల ఎత్తులో ఎగిరే డ్రోన్ కెమెరాలు నిముషాల్లో వారిని కెమెరాల్లో బంధించి పోలీసులకు ఆధారాలు చేరవేస్తాయి.ట్రాఫిక్ నియమాలకు దొరికితే భారీ మూల్యం..!————————- కేవలం నేరాలే కాదు, రోడ్డుపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవాళ్లు కూడా ఈ కెమెరాల నుండి తప్పించుకోలేరు. అతి వేగంతో దూసుకుపోవడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, త్రిబుల్ రైడింగ్ చేయడం వంటి ఉల్లంఘనలను డ్రోన్లు చిత్రీకరిస్తాయి. మీరు చూసుకోకపోయినా, పైన డ్రోన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. తక్షణం చలాన్లు వేయడం జరుగుతుంది.”ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత..___________________________ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతికతను ఆయుధంగా మలచుకున్నామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదని ప్రతి అడుగులో మా నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు.మీ సమాచారం.. మా రక్షణ..!———————–ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా 1972 కు కాల్ చేయాలని సమాచారమిచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ కునుబిల్లి పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





