నేటి సాక్షి,నారాయణపేట, డిసెంబర్ 30, నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో 2025 సంవత్సర వార్షిక నివేదికను పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కొత్తగ 17/2/2019 న ఏర్పడింది అని జిల్లాలో ఒక సబ్ డివిజన్, నాలుగు సర్కిల్ పోలీస్ స్టేషన్లు, 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన శాంతి భద్రతలు, నేరల నియంత్రణ మహిళలు బాలికల భద్రత రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాల నియంత్రణలో సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఈ సంవత్సరం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రోజువారి విధులతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ప్రజలకు నిరంతరం సేవలందించారు అని అన్నారు.గత ఏడాది కన్నా ప్రస్తుత సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అందులో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్ లు మొదలగు నేరాలు తగ్గాయని ఎస్పీ తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిస్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు. డిసెంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో mcc వైలెన్స్ 12, పోల్ వయిలెన్స్ 3, లిక్కర్ సీజ్, లిక్కర్ కేసులు 63, ఇతర కేసులు 2 నమోదు అయ్యాయిజిల్లాలో 4 జాగిలాలు ఉన్నాయి. 1 నార్కోటిక్,స్నైపర్ 1 , ట్రాకర్ కలిగి ఉన్నాయి. డాగ్ స్క్వాడ్ ను 224 తనిఖీలకు ఉపయోగించాం. లోక్ అదాలత్ ద్వారా 849 FIR కేసులు,9511 ఈ పెట్టి కేసులు, 2490 DD కేసులు నమోదు చేయడం జరిగిందని,సైబర్ క్రైమ్ లకి సంబంధించి 368 ఫిర్యాదులలో 165 కేసులు పరిష్కరించాం అని, ఈ కేసులలో 43,74,618/- రూపాయలకు గాను కోర్టు ఆదేశాల ద్వారా 20,40,000 రూపాయలు రికవరీ చేశాం అని అన్నారు. డయల్ 100 జిల్లా పరిధిలో 11,124 కాల్స్ వచ్చాయని, బ్లూ కోట్స్ పోలీసులు 24*7 ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సత్వర సేవలందించడం జరిగిందని తెలిపారు.2024 -2025 కి గాను మొత్తం రిపోర్టెడ్ కేసులు 10.5% పెరిగింది అని (గ్రేవ్) తీవ్రమైన నేరాలు 22% తగ్గాయి. కిడ్నప్ కేసులు 4% పెరిగాయి. రేప్,పోక్సో మహిళా పై జరిగే నేరాలు 12.5% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4% తగ్గింది,చైల్డ్ మ్యారేజ్ 40% తగ్గింది. సెయిర్ అప్లికేషన్ ద్వారా పోలీస్ టీమ్స్ ట్రాక్ చేసి 236 మొబైల్,వాటి విలువ 35.34 లక్షలు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది తెలిపారు. మర్డర్,కల్పబుల్ హోమిసైడ్,అటెంటు మర్డర్, రేప్ అండ్ పోక్సో, గ్రీవెస్ హర్ట్,సింపుల్ హార్ట్ కేసుల బాగా తగ్గాయి. గంజాయి కి సంబంధించి 20 మంది పై కేసులు నమోదు చేసి 12.675 కిలోలు సీజ్ చేశాం. అక్రమ మద్యం కేసులో 147 నమోదు కాగా,1526.57 లిటర్ల్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గేమింగ్,జూదం యాక్ట్ లో 36 కేసులకు 221 మంది పై కేసు నమోదు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం 1ట్రాఫిక్ ఎస్ఐ, 17 పోలీస్ సిబ్బందిని నియమించి ట్రాఫిక్ నియంత్రణ, బద్దీకరిస్తూ, రోడ్డు ప్రమాదాల అభిమానులకు చర్యలు తీసుకుంటూ, ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతూ ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సం. నిర్వహించడం జరిగిందని ఇది నిరంతరం కొనసాగుతుందని, ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించగా 31 మంది కాల్ చేసి సమస్యలు తెలియజేయాగ పరిష్కరించాం అని అన్నారు.శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండడం జరుగుతుందని, జిల్లాలో ముఖ్యమైన పండుగలు జాతరలు, విఐపి వీఐపీ పర్యటనలు ఇలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణకు ఈటింగ్ నిరోధకానికి షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని పాఠశాల కళాశాల గ్రామాల్లో ఉద్యోగస్తులు పనిచేసే చోట విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలపై ఎలాంటి నేరాలు జరిగినా వెంటనే షి టీమ్ పోలీసులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మహిళా బాధితులు మైనర్ బాలికల వసతి రక్షణ హాస్పిటల్ కౌన్సిలింగ్ కొరకు భరోసా సెంటర్ నిరంతరం పనిచేస్తుందని బాధిత మహిళలు భరోసా సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.కమిటీ పోలీసింగ్ లో భాగంగా 359 సిసి కెమెరాలు ఉండగా ఈ సంవత్సరం 161 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మొత్తం 251 సీసీ కెమెరాలు పట్టణ గ్రామీణ ప్రాంతంలో పోలీస్ భద్రతాన్నిగా కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిని కమాండ్ కంట్రోల్ నుండి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. యువతను డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు యువతతో మమేకం అవుతూ జిల్లాలో 30 టీం లతో స్పోర్ట్స్ మీ నిర్వహించడం జరిగిందని, యువత క్రీడల వైపు మొగ్గు చూపుతే ఇతర అలవాట్లకు దూరం అవుతారని తెలిపారు. జిల్లా పరిధిలో సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం తోపాటు సైబర్ నేరాలకు గురైన వారిని జిల్లా D4C టీమ్ ద్వారా కేసులు నమోదు చేసి వాటిని పరిష్కరించి బ్యాంకుల ద్వారా డబ్బులను రిఫండ్ చేయించడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాలు ముందస్త్ అవగాహనతోనే చాలా మటుకు నివారించవచ్చని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే గోల్డెన్ అవార్ లో 1930 కంప్లైంట్ చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ ప్రజల ధన మన ప్రాణ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని, 2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని ఆలంబిస్తూ నారాయణపేట జిల్లా పోలీసు బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున ఎస్పీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

