Monday, March 16, 2026

• నేషనల్ హైవే రోడ్డు నాసిరకం..• పైపైనే ఎన్ హెచ్ అధికారులు తనిఖీలు నంద్యాల బ్యూరో నవంబర్ 05

నేటి సాక్షి:కర్నూల్ జిల్లా నుంచి నేషనల్ హైవే 340సి రహదారి రూ.1200 కోట్లతో నాలుగు లైన్లు రహదారి విస్తరణ మొదలుపెట్టారు. జాతీయ రహదారి నిర్మాణం ఏర్పాటయితే ఆ దారి వెంబడి ఉండే గ్రామాల ప్రజలు, వాహనదారులు ఎంతో సంతోష పడతారు. ప్రయాణ కాలం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చోటు ఉండకపోవడమే కారణం, అయితే ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న కర్నూలు -గుంటూరు ప్రధాన రహదారి 340సీ జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. చినుకు పడితే ఫ్లైఓవర్లు పై వాహనాలు నిలుపుదల చేసి సర్వీస్ రోడ్డు గుండ వాహనాలను పంపిస్తున్నారు. ఎందుకంటే నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు ఫ్లై ఓవర్ బయటకు ఉబ్బుతుంది. కొన్ని నెలల క్రితం ఉబ్బుతున్న వాటికి రాడ్లు ఏర్పరిచి సమస్యను మూసివేశారు. అబద్ధం ఎంత దాచిన ఏదోక రూపంలో బయటికి వస్తుంది అనే సామెతలో ఉన్నట్లు, క్వాలిటీని ఎంత దాచినప్పటికీ, ఇప్పుడు మెల్ల మెల్లగా ఫ్లైఓవర్ బాగోతం బయటకు వస్తుంది. రాడ్లు ఏర్పరచినప్పటికీ ఫ్లైఓవర్ ముందుకు ఉబ్బుతూనే బయటకు వస్తుంది. అప్పుడు ఫ్లైఓవర్ కి ఒక సైడు నుంచి రాడ్ల మరమ్మతులు చేసి వదిలేశారు. ఇప్పుడు ఫ్లైఓవర్ పై రాడ్లు దింపేందుకు ఫ్లవర్ పై ఓల్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీటికి కారణం అతి త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశం అలాగే నాణ్యత లోపించి కూడా వీటికి కారణమని ప్రయాణికుల నుంచి విమర్శనాలు వస్తున్నాయి. ఫ్లైఓవర్ ఎప్పటికైనా ప్రమాదమని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తుండటంతో ఒక మనిషి విలువైన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనీ ఓ వైపు నాసిరకం పనులు.. మరో వైపు రాజకీయ మలుపులతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 లో మంజూరైన ఈ రహదారి 2025 నాటికి కూడా పూర్తిగా పనులు జరగలేదు. నేషనల్ హైవే పై నాసిరకప్పు రోడ్డు వేసి అక్కడక్కడ రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఏ ఫ్లైఓవర్లు చూసిన ముక్కున వేలేసుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చేసిన పనులనే మళ్లీ చేయాల్సి వస్తోంది. శ్రీశైలం ప్రధాన కుడిగట్టు ఎస్ఆర్ఎంసి ( తెలుగు గంగా ) లో జరిపిన తవ్వకాలలో బయట పడిన బిలుకు (స్పయిల్) ను గుట్టలుగా పేరుకుని ఉంది. ఈ బిలు కును అక్కడే ఒక క్రషర్ నెల కొల్పి సన్నని ముక్కలుగా చేసి అలా తయారైన కంకరను 340సీ జాతీయ రహదారి అడుగు పాటుకు వినియోగించారు. రోడ్డు మాత్రమే కాదు అక్కడక్కడ రోడ్డు భద్రతకు సైడ్ కు కూడా వాడారు.నేషనల్ హైవే ఫ్లైఓవర్ సైడ్ (పక్కనే) ఎర్ర రాయి వాడటం సాధారణంగా అనుమతించబడదు. నేషనల్ హైవేల పరిధిలో ఫ్లైఓవర్ సైడ్ వైపు సాధారణంగా డోరైన రోడ్డు రక్షణ కోసం గ్రానైట్ రాయి, తెల్లటి రాయినే వాడాలి. అంతే కాకుండా, రహదారుల నిర్మాణంలో సైడ్ రాయి క్రష్డ్ లైమ్ స్టోన్ వంటివి ఉపయోగించడం మంచిదనీ ఎందుకంటే ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం నిలిచే నిర్మాణాన్ని ఇవ్వగలవని నేషనల్ హైవేలకు సైడ్ కు క్రష్డ్ స్టోన్, ముఖ్యంగా క్రష్డ్ లైమ్ స్టోన్ లేదా గట్టి రాళ్ళను వాడాలి అని తెలిసిన ఎర్ర రాయి రహదారి సైడ్ కు బేర్చారు. వాటిని అధికారులు చూసిన చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జూపాడు బంగ్లా ఫ్లైఓవర్ రహదారిపై గుంతలు గుంతలుగా ఏర్పడిన వాటికి మరమ్మతులు మొదలుపెట్టారు. కృష్ణరావుపేట ఫ్లవర్ పై గుంతలను సన్నటి కంకర ద్వారా కనిపించకుండా పూర్తి వేశారు. ఒకవైపు గుంతల ద్వారా ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అప్రమత్తం అవ్వాల్సిన నేషనల్ హైవే అధికారులు గుంతలు పడితే ప్యాచ్ వర్క్ చేస్తారు కదా అనే ఆలోచన ఉన్నారు కానీ. ఒక గుంత వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే కుటుంబాలను రోడ్డున పడతారనే విషయాన్ని మరిచారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడావాల్సిన బాధ్యతను మర్చిపోయారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *బన్నూరు* *పాత* *బ్రిడ్జి* *స్థితిగతులు* :బన్నూరు గ్రామం వద్ద పాత బ్రిడ్జి పైన హైవే పనులు పూర్తి చేశారు. బ్రిడ్జిని కూల్చి వాటి స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి వాటిపైన నేషనల్ హైవే రహదారి విస్తరణ పనులు జరిగే విధంగా అధికారులు చేయాలి. కానీ పాత బ్రిడ్జి పైనే మరమత్తులతో పూర్తి చేశారు. పాత బ్రిడ్జి కూల్చాల్సిన అవసరం లేదని వాటిపైనే రహదారులు ఏర్పాటు చేయాలని అధికారులు వెల్లడిస్తున్నారు. పాత బ్రిడ్జి క్రింద నెర్రలు కొట్టి, అడుగు భాగాన స్లాప్ పేక్కులు పెక్కులుగా రాలి, కడ్డీలు నాణ్యతను కోల్పోయి కింద పడుతున్నాయి. పాత బ్రిడ్జి 10 సంవత్సరాలు కూడా వుంటుందో లేదో కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చే దిశలో అధికారులు ఉన్నట్లు విమర్శలను వస్తున్నాయి. కాంట్రాక్టర్లను మెయింటెనెన్స్ 15 నుంచి 20 సంవత్సరాల వరకు మాత్రం ఉంటుంది అంతవరకు పనికి వస్తే చాలన్నట్లు అధికారులు అభిప్రాయంగా ఊహించుకుంటున్నట్లు వాహనదారులు చర్చించుకుంటున్నారు. వాటి స్థానంలో కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేస్తే 30 నుంచి 40 సంవత్సరాల వరకు బ్రిడ్జిపై వాహనదారులు సుఖవంతంగా ప్రయాణం కొనసాగించవచ్చు. ఇన్ని ప్రధాన సమస్యలు ఉన్నప్పటికీ నేషనల్ హైవే పిడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏదైనా ప్రమాదం సంభవిస్తే పిడి నిర్లక్ష్యంలే వీటికి ప్రధాన కారణం అని వాహనదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News