నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి డిసెంబర్ 13 : సమయపాలన పాటిస్తూ ఎన్నికలను సమర్ధవంతంగా పారదర్శకంగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2025లో భాగంగా శనివారం నల్లబెల్లి మండలంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రతి కౌంటర్‌ను తనిఖీ చేసి, ఎన్నికల సామాగ్రి చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఫారం–9 ప్రకారం బ్యాలెట్ బాక్స్ తప్పనిసరిగా చెక్ చేయాలని, ప్రక్రియ ముగిసిన అనంతరం సామాగ్రిని సీల్ చేసి డిపాజిట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఎంపీడీవో డాక్టర్ జె సుభానివాస్ తహసిల్దార్ ముప్పు కృష్ణ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.





